శీతాకాలంలో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలంటే..?

మంగళవారం, 24 డిశెంబరు 2019 (13:30 IST)
శీతాకాలంలో చర్మాన్ని కాపాడుకోవడం కష్టమే అయినా ఇవి పాటిస్తే మాత్రం ఖచ్చితంగా చర్మాన్ని కాపాడుకోవచ్చంటున్నారు చర్మ నిపుణులు. చర్మం జిడ్డు కారుతుంటే ఓ రకం సమస్యలు ఎదురైతే పొడిబారినట్లుంటే మరోరకం సమస్యలు తలెత్తుతాయట. చర్మం బాగా పొడిగా ఉంటే ఎన్ని క్రీములు, లోషన్లు రాసినా ప్రయోజనం ఉండదట. అందుకే సహజసిద్థంగా చర్మాన్ని సంరక్షించుకోవడానికి ప్రయత్నించాలంటున్నారు చర్మనిపుణులు.
 
శీతకాలంలో గాలులకు చర్మం పొడిగా, బిరుసుగా తయారవుతుంది. సహజంగానే ఏ విధమైన చర్మం కలిగిన వారికైనా తెల్లగా పొట్లిపోయినట్లుగా కళా విహీనంగా తయారవుతుంది. కొంతమంది బాగా పగిలిపోయి ఇబ్బంది కూడా కలిగిస్తుంది. అలాంటి వారు చర్మం సంరక్షణ పట్ల మరింత శ్రద్థ చూపాలంటున్నారు చర్మ నిపుణులు.
 
శీతాకాలంలో సబ్బు వాడటం ఎంత తగ్గిస్తే అంత మంచిది. సబ్బును, చర్మాన్ని పొడిబార్చే ఇతర ఉత్పత్తులను ఉపయోగించకూడదు. సబ్బు చర్మంలోని తైలాన్ని పొడిబార్చి, రంధ్రాలు మూసుకుపోవడానికి కారణమవుతుంది. కాబట్టి చర్మంలోని తేమను కాపాడుకోవాలంటే గ్లిజరిన్ కలిగిన సబ్బు వాడితే మంచిది. అది కూడా రోజులో ఒకటి రెండుసార్లు కంటే ఎక్కువ వాడటం మంచిది కాదు. 
 
చర్మాన్ని తేమబరిచే గుణం కలిగిన మాయిశ్చరైజర్లతో ముఖానికి మర్థన చేయడం వల్ల చర్మ రంధ్రాల్లో మలినాలు పేరుకు పోకుండా కాపాడుకోవచ్చు. ముఖానికి రాసుకునే చాలా క్రీముల్లో వ్యాక్స్ అధికంగా ఉంటుంది. క్రీమ్‌లోని నీటి పరిణామం ఆవిరైపోతే గట్టి వ్యాక్స్ పదార్థం అలాగే ఉండిపోయి చర్మ రంధ్రాలు మరింత మూసుకుపోతాయట. కనుక క్రీమ్ లను జాగ్రత్తగా పరిశీలించి ఉపయోగించాలి. 
 
చలికాలంలో రాత్రి పడుకునే ముందు రోజూ చర్మానికి నైట్ క్రీమ్ లు రాసుకోవాలి. పాలు, పళ్ళు చెరుకుతో తయారయ్యే ఆల్ఫా హైడ్రోక్సి యాసిడ్స్ ఉండే క్రీమ్ లు మాత్రమే రాసుకోవాలట. దీని వల్ల చర్మం పొడిగా అయి కళావిహీనంగా మారకుండా మృదువుగా మెరుస్తూ ఉంటుందంటున్నారు చర్మ నిపుణులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు