చాలామంది యువతుల ముఖంపై అవాంఛిత రోమాలు ఇబ్బంది పెడుతుంటాయి. వీటి వల్ల యువతుల ముఖారవిందం దెబ్బతింటుంది. ఈ తరహా రోమాలు ఉన్న వారు నలుగురిలోకి వచ్చేందుకు సిగ్గుపడుతారు. అయితే, ఈ రోమాలు.. కొంతమందికి పల్చగా కనపడితే, మరికొంతమందికి కనిపించకుండా ఉంటాయి. మరికొందరికి దట్టమైన కేశ సంపద ఉంటుంది.
ఇలా ఎక్కువగా ఉన్నట్లయితే వారి శరీరం మగవారి శరీరంలా ఉంటుంది. ఇలాంటివారు ఎంత అందంగా ఉన్నా కూడా ఈ లోటు అందాన్ని తగ్గించేస్తుంది. దీంతోపాటు ఇలాంటివారు మానసికంగా కుంగిపోతుంటారు. దీనికి పరిష్కారం వెంట్రుకలను తొలగించడమే. ఈ వెంట్రుకలను ఎలక్ట్రాలసిస్, త్రెడ్డింగ్, వ్యాక్సింగ్ పద్ధతుల ద్వారా వెంట్రుకలను తొలగించుకోవచ్చు.
ఎలక్ట్రాలసిస్ : ఎలక్ట్రాలసిస్ అనేది పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో బ్యుటీషియన్లు చేస్తుంటారు. ఇలాంటి ట్రీట్‌మెంట్ తీసుకోవాలనుకుంటే డబ్బుతో కూడుకున్న పని. ఇంతగా కష్టపడి చేసుకున్నా మళ్ళీ వెంట్రులు వచ్చేస్తాయి. కనుక ఇది తాత్కాలికమైన ప్రక్రియే.