సౌభాగ్యానికి, ఆరోగ్యానికి సంకేతాలు పసుపు, కుంకుమలు. హిందూ సంస్కృతిలో పసుపుకుంకుమలకు విశిష్టమైన స్థానం ఉంది. ఆడవాళ్ళ అయిదవతనానికి, ముత్తైదువుల మాంగల్యానికి రక్ష పసుపు కుంకుమలు. పసుపు అనేక రకములైన వ్యాధులను నయం చెయ్యడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందనీ ఇటీవల పరిశోధనలో వెల్లడయ్యింది. పసుపు వల్ల ఆరోగ్యమే కాకుండా అందం కూడా మన సొంతం అవుతుంది. పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
1. రక్తహినతతో బాధపడేవారు ప్రతిరోజు పసుపు, త్రిఫలా చూర్ణం, నెయ్యి, తేనె.... టీ స్పూను మోతాదులో తీసుకుని ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు సేవించడం వల్ల రక్త హీనత సమస్య నుండి బయటపడవచ్చు.