ఎండాకాలంలో నీళ్లెక్కువ తాగండి.. చర్మాన్ని కాపాడుకోండి..

సోమవారం, 22 మే 2017 (14:45 IST)
చర్మం మృదువుగా తయారవ్వాలంటే.. కమలాపండు, నారింజ, నిమ్మచెక్కల్ని పారేయకుండా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని డబ్బాలోకి తీసుకుని.. రెండు రోజులకు ఓసారి సెనగపిండిలో కలిపి మోచేతులు, మెడకు పూతలా వేసుకుని కడిగేస్తే.. చర్మం కోమలంగా, మృదువుగా మారుతుంది. ఎండాకాలంలో తగినంత నీరు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
 
చర్మంలో తగినంత తేమ కోసం గంటకు ఓసారి గ్లాసుడు నీళ్లు తాగాలి. ఎక్కువగా నీరు తాగడం ద్వారా చర్మం తాజాగా కనిపిస్తుంది. ముఖంపై మొటిమలున్నవారికి చర్మం పొడిబారడం వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కనుక చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. - స్నానానికి సరైన సబ్బును ఉపయోగించడం మంచిది. 
 
ముఖ్యంగా కొన్ని రకాల సబ్బులు చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. కానీ అధిక వేడిగల నీటితో కానీ లేదంటే మరీ చన్నీళ్లతో గానీ స్నానం చేయకూడదు.

వెబ్దునియా పై చదవండి