తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ పాత్రకు సంబంధించిన లుక్ రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ను చూస్తుంటే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక త్వరలో టీజర్‌ను విడుదల చేసి సినిమాపై మరింత అంచనాల్ని పెంచాలని మేకర్లు భావిస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టే ఉంటాయని నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్ తెలిపారు. దసరాకి విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని అన్నారు.
తారాగణం: అమర్‌దీప్ చౌదరి, సాయిలీ చౌదరి, టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్.
మ్యూజిక్ డైరెక్టర్‌గా సుభాష్ ఆనంద్ , డైలాగ్ రైటర్‌గా బండారు నాయుడు, ఎడిటర్‌గా నాహిద్ మొహమ్మద్ , డీఓపీగా హాలేష్ పని చేస్తున్నారు.