మెుటిమలను తొలగించటానికి వేపాకులు తీసుకుంటే?

గురువారం, 7 జూన్ 2018 (12:47 IST)
వేసవిలో ఎక్కువగా ఉండటం వలన మెుటిమలు, మచ్చలు తయారవుతుంటాయి. అందుకు ముఖ్య కారణం మీరు రకరకాల నూనెలు వాడటమే. కాబట్టి అటువంటి వారికి మెుటిమలు తొలగిపోవాలంటే ఈ చిట్కాలను తెలుసుకుంటే మంచిది.
 
గిన్నెలో కొంచెం వేడినీళ్లు తీసుకుని అందులో 4 లేదా 5 వేపాకులను వేసి ముఖానికి ఆవిరి పట్టించాలి. మీరు ఆవిరి పట్టిన వేపనీరు చల్లారిన తరువాత ఆ నీటితోనే ముఖం కడుక్కుంటే మెుటిమలు మాయమవుతాయి. సున్నెపిండిలో నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడుక్కోవాలి. ఇలా చేసినట్లైతే మీ ముఖం అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది.
 
ప్రతిరోజు ముఖానికి చిక్కుడు ఆకుల రసం రాసుకుని 5 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మచ్చలు, మెుటిమల నుంటి త్వరగా ఉపశమనం పొందవచ్చును. కొన్ని బీర ఆకులను తీసుకుని అందులో కాస్త పసుపు, నిమ్మరసం కలిపి మెత్తగా నూరి ముఖానికి రాసుకుని 30 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేయడం వలన మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు