మీది జిడ్డు చర్మం అయినా, ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నా 3 నిమిషాలు పాటు ఫేషియల్ స్టీమ్ తీసుకుంటే మంచిది. ముందుగా ముఖాన్ని నీటితో బాగా శుభ్రంగా కడుకున్న తరువాత అరటిపండు గుజ్జును ముఖం అంతా సమానంగా పట్టించి 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇలాచేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది. అరటిపండు తొక్కతో ముఖం మీద తేలికగా రజ్ చేస్తూ చర్మంలో ఉన్న మృతుకణాలను తొలగించుకోవాలి.
మృతుకణాల తొలగింపు తరువాత అరటిపండులో కోకో బటర్ కలిపి ముఖానికి మసాజ్ చేసుకోవాలి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. చివరగా బనానా పాక్‌ను మెడకి పట్టించి 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో మెడను శుభ్రం చేసుకొని మెత్తటి టవల్‌తో తుడుచుకుంటే మెడ అందంగా కనబడుతుంది. న్యూట్రిషన్ విలువలున్న వీటి వలన ఎండిపోయినట్టున్న మీ చర్మం మృదువుగా మారుతుంది.