వేసవిలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంది అలాంటి సమయంలో ఎక్కువగా సబ్బుతో చాలా మంది కడుగుతూ ఉంటారు అలా చేయడం మంచి పద్దతి కాదు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే ఎంతో మంచిది. ఆకుకూరలు, కాయగూరలు అధికంగా వాడాలి. పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, పండ్లరసాలు వీటిన్నంటిని తీసుకుంటే మీ చర్మం మృదువుగా అందంగా కనిపిస్తుంది. అలాగే ఉదయం వేళల్లో ఇడ్లీ, ఉప్మా వంటి తేలిక పదార్థాలు తీసుకుంటే మంచిది.
మీ పేలిన చర్మానికి స్నానం చేసిన తరువాత మంచి గంధాన్ని అరగదీసి చేతులు, వీపు, మెడ, నడుముకు రాసుకోవాలి. అలాగే స్నానం చేసే ముందుగా తులసి ఆకులు, తమలపాకులు కలిపి దంచి ఆ మిశ్రమాన్ని ఒళ్ళంతా రుద్దుకొని ఓ గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చమట కాయల సమస్య నుంచి బయటపడవచ్చును.
వేసవిలో చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే మంచి నీళ్ళు ఎక్కువగా త్రాగడం అన్నింటికంటే ముందుగా చేయాల్సింది. మనం ఎప్పుడు త్రాగే నీటికంటే ఒక లీటరు నీటిని ఎక్కువగానే తీసుకోవాలి. వేసవి కాలంలో వేడిమి వలన శరీరం నుంచి చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకి వెళ్తుంది కాబట్టి శరీరంలో నీరు మంరింతగా ఉండటానికి ఎక్కువగా నీటిని తీసుకోవాలి.