జుట్టు పెరగడానికి బేకింగ్ సోడాను తీసుకుంటే? ఎలా? ఎందుకు?

సోమవారం, 14 మే 2018 (15:18 IST)
కొంతమంది ముఖంపై తీసుకున్న శ్రద్ధ జుట్టుపై తీసుకోరు. ఐతే కేశాలకు కూడా ప్రాముఖ్యతనివ్వాల్సిందేనని జుట్టు ఊడిపోతుంటే కానీ అర్థం కాదు. కనుక అలాంటి వాళ్లకు బేకింగ్ సోడాను వాడాలి.
 
 
 
జుట్టుని హెల్తీగా, క్లీ‌న్‌గా ఉంచుకోవాలంటే ఈ రెమిడీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒక స్పూన్ బేకింగ్ సోడాను చిన్న కప్పులో తీసుకోవాలి. అందులో రెగ్యులర్‌గా ఉపయోగించే షాంపూను 2 టేబుల్ స్పూన్లు కలపాలి. బాగా మిక్స్ చేసి జుట్టుకి పట్టించాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. తరువాత షాంపూను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల జుట్టు చాలా ఫ్రెష్‌గా, హెల్తీగా కనిపిస్తుంది. 
 
అదేవిధంగా ఈ బేకింగ్ సోడాను ఒక స్పూన్ తీసుకుని అందులో కొంచెం నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 2 నిమిషాల తరువాత కడిగి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మంచి ఫలితాలనిస్తాయి. ఇలా చేయడం వలన మొటిమలు తొలగిపోతాయి. ముఖం మృదువుగా కనిపిస్తుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు