రాత్రిపూట రెండు స్పూన్ల మెంతుల్ని నానబెట్టి.. ఉదయం తల మాడుకు రాసుకుని నాలుగైదు గంటల పాటు వుంచి.. తర్వాత తేలిక పాటి షాంపుతో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తలను పొడిబట్టతో తుడుచుకుని.. లేత సూర్యకిరణాలు తలపై పడేలా నిలిస్తే కూడా చుండ్రు దూరమవుతుంది. విటమిన్ డి లోపంతో కూడా చుండ్రు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.