గులాబీ రేకుల‌ని పాల‌లో వేసి పేస్ట్‌లా చేసి..?

బుధవారం, 6 అక్టోబరు 2021 (22:09 IST)
తేనెలో కొంచెం పంచ‌దార మిక్స్ చేసి పెద‌వుల‌కు అప్లై చేయాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకుంటే పెదువుల‌పై ఉన్న మురికి తొలిగి అందంగా క‌నిపిస్తాయి. ప్ర‌తి రోజు క‌ల‌బంద జెల్‌ను పెద‌వుల‌కు అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పెద‌వులు పొడిబార‌డాన్ని త‌గ్గిస్తుంది.

ట‌మాటాలో కొంచెం పెరుగు మిక్స్ చేసి పెద‌వులు బాగా మ‌సాజ్ చేయాలి. ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల పెద‌వులు అందంగా, ప్ర‌కాశవంతంగా క‌నిపిస్తాయి.
 
ప్ర‌తి రోజూ పడుకునే ముందు ఆలివ్ ఆయిల్‌ను పెదాలపై మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచుకుని మార్నింగ్ వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు తేమవంతంగా మారుతాయి.

పచ్చి బంగాళాదుంప ముక్కల్ని పెదవులకు మృదువుగా మ‌సాజ్ చేసుకుంటే పెదవులు మెత్తబడడంతో పాటు నల్లని పెదవులు గులాబీ రంగులోకి వ‌స్తాయి. 
 
గులాబీ రేకుల‌ని పాల‌లో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని పెద‌వుల‌కు మృదువుగా అప్లై చేసుకోవాలి. ఈ చేయ‌డం వ‌ల్ల పెద‌వులు స‌హ‌జ‌మైన క‌ల‌ర్‌ను పొందుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు