చలికాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే.. బచ్చలికూర, బీట్‌రూట్ వంటివి తీసుకోవాల్సిందే. ఈ కూరగాయలతో చేసిన సలాడ్ లేదా రసాలు తీసుకునేటప్పుడు వాటిపై కొంచెం జనుము గింజలు చల్లుకోవడం కూడా మంచిదట. జనుము, బాదం వంటి గింజల్లో ఉండే విటమిన్-ఈ చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది.
చలికాలంలో మనకు అందుబాటులో ఉండే బీట్‌రూట్, బచ్చలి, ఉసిరి వంటి కూరగాయల రసాలు తీసుకుంటే చర్మం మెరిసిపోతుంది. టొమాటోలు కూడా చర్మానికి చాలా మంచివని, చర్మం తేమగా, ప్రకాశవంతంగా ఉండటానికి టొమాటో ఉపయోగపడుతుంది. మంచినీళ్లతో పాటు ఇతర ద్రవాలను తీసుకోవడం వల్ల కూడా చర్మం పొడిబారడాన్ని అరికట్టొచ్చన్నారు.
చలికాలంలో ఆపిల్, ఆరెంజ్, జామకాయ కొబ్బరి నీళ్లు తీసుకుంటూ వుండాలి. వీటిలో విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో బయట తినే అవాటును దూరం చేసుకోవాలి. అప్పుడే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.