పాల పొడిలో కొద్దిగా బాదం నూనె, నిమ్మరసం, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కిందటి గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. పాలలో నిమ్మరసం, పసుపు కలుపుకుని పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
వాల్‌నట్స్ పొడిలో పాల పొడి, తేనె, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. బంగాళాదుంప మిశ్రమంలో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత దూదితో మర్దన చేసుకుని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
టమోటా మిశ్రమంలో తేనె, నిమ్మరసం కలుపుకుని పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది. పాల పొడిలో కుంకుమ పువ్వు, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని గంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖచర్మం తాజాగా మారుతుంది.