చలికాలం వచ్చేసింది... పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తున్నారు?

గురువారం, 12 డిశెంబరు 2019 (20:03 IST)
వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు ఆహారంలో కూడా మార్పులు చేసుకుంటూ వుండాలి. పిల్లలు శీతాకాలంలో వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగ్గా తీసుకోవాలి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.
 
1. బొప్పాయి, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, జామ పండ్లు ఎక్కువగా ఇవ్వండి. పండ్లలోని విటమిన్ 'సి' వ్యాధినిరోధక శక్తి చురుగ్గా పనిచేస్తుంది.
 
2. పిల్లలు సాయంకాలం స్కూల్ నుంచి రాగానే వేయించిన వేరుశనగపప్పు, బెల్లం, ఖర్జూరం లేక అటుకులు-పాలు-బెల్లం కలిపి ఇవ్వడం వల్ల కావలసినంత ఐరన్, ప్రొటిన్లు, క్యాల్షియం లభిస్తాయి.
 
3. పడుకునే ముందు గ్లాస్ పాలు గాని, మజ్జిగ గాని ఇస్తే జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.
 
4. చేప, మాంసాహారం వారానికి ఒకసారైనా ఆహారంలోకి ఇస్తే పిల్లల ఎదుగుదలకి సహాయపడుతుంది.
 
5. తేనె లేదా మజ్జిగ, పళ్ల రసాలను నీళ్లలో కలిపి సిప్పర్‌లో పోసి ఇస్తూవుంటె పిల్లలూ బాగా ఇష్టపడి తాగుతారు. 
 
6. టొమాటో, కార్న్ వంటి వేడి వేడి సూప్‌లు ఒంట్లోని చలిని తరిమేస్తాయి. ఆకలిని పెంచుతాయి. 
 
7. రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు, తాజా పళ్లరసాలు, మిల్క్ షేక్స్ లాంటివి ఇవ్వడం వల్ల పిల్లల చర్మం సహజతేమను కోల్పోదు.
 
8. ఉదయాన్నే ఒక కప్పుడు గోరువెచ్చని పాలలో స్పూన్ తేనె కలిపి ఇవ్వాలి. తేనెలోని పోషకాలన్నీ పిల్లలను చురుగ్గా ఉండేలా చేస్తాయి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు