2009-10 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న విత్తమంత్రి

సోమవారం, 6 జులై 2009 (11:33 IST)
FileFILE
2009-10 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్‌లో సమర్పిస్తున్నారు. సోమవారం ఉదయం సరిగ్గా 11 గంటలకు ఆయన బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని ఆరంభించారు. గత 25 సంవత్సరాల క్రితం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనుభవం ఆయనకు ఉంది. 1982, 83, 84 సంవత్సరాల్లో ఆయన బడ్జెట్‌ను దాఖలు చేసి, అందరి మన్నలు, ప్రశంసలు పొందారు.

తాజాగా, మరోమారు తనుకున్న అపారమైన రాజకీయ అనుభవంతో 2009-10 ఆర్థిక బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. తన బడ్జెట్ ప్రారంభ ప్రసంగంలో వార్షిక వృద్ధి రేటు 9 శాతానికి పెంచే లక్ష్యంగా చర్యలు చేపడుతామని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుస్తామన్నారు.

వ్యవసాయ రంగం ఉన్నతికి మరిన్ని చర్యలు చేపడుతామని చెప్పుకొచ్చారు. పరిశ్రమ, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగ పాఠంలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి