2009-10 సాధారణ బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు

సోమవారం, 6 జులై 2009 (12:59 IST)
FileFILE
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సమర్పించిన 2009-10 సాధారణ వార్షిక బడ్జెట్‌లో పేర్కొన్న అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. వ్యక్తిగత ఆదాయం పన్ను పరిమితిని పెంచారు. జాతీయ స్థాయిలో గ్యాస్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. బీమా, బ్యాంకింగ్ రంగాలను ప్రైవేట్ పరం చేయబోమని ముఖర్జీ తన ప్రసంగ పాఠంలో స్పష్టం చేయడం గమనార్హం.

* వార్షిక వృద్ధి రేటు లక్ష్యం 9 శాతం
* 2014 నాటికి మౌలిక రంగం పెట్టుబడుల లక్ష్యం 9 శాతం
* రైల్వేలకు అదనంగా 15వేల కోట్లు కేటాయింపు
* జాతీయ రహదారుల అభివృద్ధికి 23 శాతం మేర నిధులు పెంపు
* వ్యవసాయ వృద్ధిరేటు లక్ష్యం 4 శాతం
* 2009-10 సంవత్సరంలో వ్యవసాయ రుణాలు రూ.3.25 లక్షల కోట్లకు పెంపు
* ఇంధన రంగానికి 60 శాతం నిధుల పెంపు
* పట్టణ పేదరిక నిర్మూలనకు రూ.3,973 కోట్లు
* పట్టణ పేదల గృహ నిర్మాణానికి రూ 3,273 కోట్లు
* కార్పొరేట్‌ ట్యాక్స్‌ యథాతదం
* ఫ్రింజ్‌ బెనిఫిట్‌ట్యాక్స్‌ రద్దు
* త్వరలో కొత్త పింఛను విధానం
* వ్యక్తిగత ఆదాయ పన్ను పెంపు
* రక్షణ రంగానికి 1,41,700 కోట్లు
* భారత్‌ నిర్మాణ్‌ పథకానికి 45 శాతం నిధులు
* బృహత్‌ ముంబై అభివృద్ధి యోజనకు రూ.2వేల కోట్లు
* జాతీయ గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు
* వచ్చే ఐదేళ్లో రాజీవ్‌ ఆవాస్‌ యోజనా పథకం కింద నగర పేదలకు గృహాలు
* ఇంధన రంగానికి 70 శాతం నిధులు పెంపు
* పత్రికా రంగానికి ఉద్దీపన ప్యాకేజీ డిసెంబర్‌ వరకు కొనసాగింపు
* ఐటీ రిటర్నుల దాఖలు మరింత సరళం
* పట్టణ గ్రామీణ, పట్టణ పేదలకు రూ.3లకే కిలో బియ్యం, గోధుమలు
* బ్యాంకులను, బీమారంగ సంస్థలను ప్రైవేటు పరం నుంచి దూరం
* గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 39,100 కోట్లు
* రాజీవ్‌ గ్రామీణ విద్యుద్దీకరణకు రూ.7 వేల కోట్లు
* కొత్తగా రూ.100 కోట్లతో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన
* ఇందిర ఆవాస్‌ యోజనా పథకానికి రూ.8,800 కోట్లు కేటాయింపు
* వస్తు వినిమయ పన్ను త్వరలో రద్దు
* ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సాయం
* జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ.1500కోట్లు
* దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఉపాధికల్పనా కార్యాలయాలు

వెబ్దునియా పై చదవండి