ఇది ప్రజల బడ్జెట్: మమతా బెనర్జీ

కేంద్ర రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ శుక్రవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్‌సభలో మధ్యాహ్నం 12.00 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. రైల్వేల్లో సౌకర్యాలు, స్టేషన్లలో జనతా భోజనాల సరఫరాను మెరుగుపరిచేందుకు తాజా బడ్జెట్‌లో చర్యలు ఉంటాయనే ఊహాగానాల నేపథ్యంలో మమతా బెనర్జీ ఈసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

పార్లమెంట్‌లో తాను ఈసారి ప్రజల బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని ఆమె చెప్పారు. ఈసారి రైల్వే బడ్జెట్‌కు ప్రజాస్వామ్య బడ్జెట్ అని మమతా బెనర్జీ కొత్త భాష్యం కూడా చెప్పారు. రైల్వేల్లో సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు ఆమె పలు చర్యలు ప్రకటించారు. రైల్వేస్టేషన్లలో భద్రత, సమయపాలనపై దృష్టిపెడతామన్నారు.

5 వేల పోస్టాఫీసుల్లో రైల్వేటిక్కెట్లు అందుబాటులోకి తెస్తామన్నారు. ఎస్ఎంఎస్‌ల ద్వారా కూడా టిక్కెట్లను ప్రవేశపెడతామన్నారు. వికలాంగుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక రిక్యూట్‌మెంట్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. టాలీగుంజ్‌లో మెట్రో రైల్ ఆస్పత్రిని ఆధునికీకరిస్తామన్నారు. రైల్వే సిబ్బంది ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి