ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆహార భద్రత బిల్లు: ప్రణబ్!

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010 (11:18 IST)
2010-11 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు ఆయన తన బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని ప్రారంభించారు. ఆయన ప్రసంగ ప్రారంభానికి ప్రతిపక్ష పార్టీలు అడ్డు తగిలారు. అయితే, సభాపతి మీరాకుమార్ జోక్యం చేసుకోవడంతో ప్రతిపక్ష సభ్యులు శాంతించారు.

గత యేడాది ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టానని, జులైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు గుర్తు చేశారు. ప్రస్తుతం 2010-11 సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్టు వివరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను అధికమించి, అభవృద్ధి రేటుపై దృష్టిసారించడమే ప్రధాన సవాల్ అని చెప్పుకొచ్చారు.

గత యేడాది ఆర్థిక మాంద్యం కుదిపేసినా.. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం మెరుగ్గా ఉందని ఆయన అధికార సభ్యులు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అయితే ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నట్టు చెప్పారు. సామాజి రంగంలో సంస్కరణలపై దృష్టిసారించాలన్నారు. ఆహార భద్రతకు ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు ఆయన తెలిపారు.

దేశ స్థూల జాతీయోత్పత్తి రేటు (జీడీపీ) పెరుగుదలను స్థిరీకరించినట్టు చెప్పారు. అదే సమయంలో రెండంకెల వృద్ధి రేటుపై దృష్టి సారించాన్నారు. కౌంటర్ సైక్లిక్ పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశం భారత్ అని గుర్తు చేశారు. ప్రస్తుతం అనే సవాళ్లను మనం ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి