మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

డీవీ

శుక్రవారం, 17 మే 2024 (10:25 IST)
KL narayana pressnote
చాలా కాలం విరామం తర్వాత శ్రీ దుర్గా ఆర్ట్స్ బేనర్ పై డా. కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న చిత్రం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లోనిదే. ఈ సినిమా గురించి లొకేషన్ల గురించి రకరకాలుగా విదేశాలకు వెళ్ళినప్పుడల్లా ఏదో కొత్త న్యూస్ అంటూ సోషల్ మీడియాలో వస్తూనే వుంది. తాజాగా ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన న్యూస్ కు నిర్మాత కె.ఎల్. నారాయణ లిఖితపూర్వకంగా నేడు వివరణ ఇచ్చారు.
 
 సినిమా క్యాస్టింగ్ డైరెక్టర్ గా విరేన్ స్వామి ఈ భారీ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు అని వార్త రావడం కరెక్ట్ కాదని నిర్మాత తేల్చి చెప్పారు. తను అపరిచితుడు సినిమాకు పనిచేశాడు. అయితే విరేన్ స్వామికి మా సినిమాకు ఎటువంటి సంబంధం లేదని. ఇదంతా గాలి వార్త అని కొట్టిపారేశాడు నిర్మాత.  ఈ ప్రాజెక్ట్ కి ఏ రకంగా కూడా ఇన్వాల్వ్ కాలేదని తెలిపారు. ఏదైనా విషయం ఉంటే అధికారికంగా తాము మాత్రమే ప్రకటిస్తామని కూడా తెలియజేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు