బడ్జెట్ అసలు స్వరూపం ఏంటంటే

శనివారం, 27 ఫిబ్రవరి 2010 (19:50 IST)
FILE
కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా వ్యవసాయరంగానికి మొండి చెయ్యి చూపిస్తోందని దేశవ్యాప్తంగా పలు విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుత వార్షిక సాధారణ బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా అది అమలుకు నోచుకునే అంశాలుగా కనపడటం లేదు. ప్రజలను మోసగించే బడ్జెట్‌‍లా వుందని పలువురు వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడ్డారు.

నిరుడు సంవత్సరం వ్యవసాయానికి మొత్తం బడ్జెట్ ప్రణాళికలో ఖర్చులు 2.37 శాతంగా ఉండింది. అదే ఈసారి బడ్జెట్‌లో 2.34 శాతానికి చేరుకుంది. పప్పు దినుసుల పంట మరింతగా కొనసాగించేందుకు ప్రభుత్వం తరపు నుంచి మరింత సహాయం అందజేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. కాని ఇది కేవలం నోటి లెక్కలు మాత్రమే. దేశంలో ఆహార సమస్య ఏదైతే ఉందో అది ప్రత్యక్షంగా వ్యవసాయంపట్ల చూపిస్తున్న వివక్షలాంటిదే. దీంతో ప్రభుత్వానికి వ్యవసాయంపట్ల అంతగా ఆసక్తి లేకపోవడమే. వ్యవసాయంపట్ల ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమ సవతితల్లి ప్రేమలాంటిదని వ్యవసాయరంగానికి చెందిన పలువురు అభిప్రాయపడ్డారు.

దేశంలో ఆహార ధాన్యాలు చాలావరకు వృద్ధాగా పోతున్నాయని ప్రభుత్వం వాదన, దీనిని చక్కబెట్టేందుకు రిటైల్ మార్కెట్‌ను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే రిటైల్ మార్కెట్ వ్యాపారస్థులు ఆహార ధాన్యాలను శుభ్రం చేసి ప్రజలకు తక్కువ ధరలకే అమ్మేందుకు ప్రయత్నిస్తారని, దీంతో వృద్ధాగా పోయే ఆహార ధాన్యాలను అరికట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం విదేశీ కంపెనీలను భారతదేశంలోకి ఆహ్వానిస్తోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు సరికదా విదేశీ కంపెనీలను దేశంలోకి ఆహ్వానించి తద్వారా రిటైల్ మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంటోంది. వాస్తవానికి దేశంలో విదేశీ పెట్టుబడులు లేకుండా దేశంలోని ఏ రంగాన్ని కూడా చక్కబెట్టలేమన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా కనపడుతోంది. దీనికి ఉదాహరణగా విదేశాలకు చెందిన పలు రిటైల్ కంపెనీలను దేశీయ రిటైల్ మార్కెట్లోకి ఆహ్వానించడమే ప్రధాన ఉద్దేశ్యంగా కనపడుతోంది.

మరో అంశం ఏంటంటే ప్రభుత్వపు ఖజానా లోటు. గత బడ్జెట్‌లో ప్రభుత్వపు ఖజానా లోటు 6.8 శాతంగా ఉండింది. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు ఖజనాను పూడ్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉండింది. కాని ఇప్పుడు ముడి చమురు ధరలపై కేంద్ర ప్రభుత్వం చాలా వరకు తన నియంత్రణ లోనికి తెచ్చుకుంది. దీంతో ఖజానా లోటును మరింతగా పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనడంలో సందేహం లేదు. ఖజానా లోటును భర్తీ చేసుకోవడంతోపాటు ఆర్థిక పరమైన ఖర్చులు కూడా ఏమాత్రం తగ్గలేదు.

లోటు బడ్జెట్‌ను తక్కువగా చూపించడం జరిగింది, ఎందుకంటే ప్రత్యక్ష పన్నుల ద్వారా రెవెన్యూ పెంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. పన్నుల విషయంలో ఒక్క విషయం మాత్రం స్పష్టమౌతోంది. అదేంటంటే... జిఎస్‌టిని ఒక ఏడాది పాటు పొడిగించడం జరిగింది. దీంతో ధరలను అదుపు చేసేందుకు అవకాశం కలుగుతుంది.

మూడో అంశం ఏంటంటే...ప్రధానంగా నిరుద్యోగ సమస్య. దేశంలో నిరంతరం నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. నిరుద్యోగ సమస్యను పారద్రోలేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వం పదేపదే వక్కాణించి చెపుతోంది. నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్‌ గురించి ప్రస్తావనే లేదు.

వెబ్దునియా పై చదవండి