మమత ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ముఖ్యాంశాలు!

బుధవారం, 24 ఫిబ్రవరి 2010 (16:57 IST)
కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ బుధవారం పార్లమెంట్‌కు సమర్పించిన రైల్వే బడ్జెట్ 2010-11లోని ముఖ్యాంశాలను ఒకసారి పరిశీలిస్తే ఆమె అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూనే బడ్జెట్‌ను ప్రకటించారు.

* స్థానిక భాషల్లో రైల్వే పరీక్షలు
* రైల్వేలను ప్రైవేటీకరించం.
* వ్యవసాయ ఉత్పత్తులకు ప్రత్యేక రైళ్లు
* రైల్వే విచారణ కోసం కొత్తగా 138 నంబరు
* కాశ్మీర్ టు కన్యాకుమారిల మధ్య శాంతి ఎక్స్‌ప్రెస్
* ఏడాదికి వెయ్యి కిలోమీటర్ల కొత్త రైల్వే లేను ఏర్పాటు
* దేశంలో ప్రయోగాత్మకంగా డబుల్ డెక్కర్ రైళ్లు
* పర్యాటక ప్రాంతాలను కలిపే సంస్కృతీ ఎక్స్‌ప్రెస్
* రైలు ప్రమాదాల నివారణకు నిధుల పెంపు
* ప్రయాణికుల సౌకర్యాలకు రూ.1302 కోట్లు
* రైల్వే అభివృద్ధి మిషన్ 2020 ప్రారంభం
* ఖరగ్‌పూర్‌లో పైలట్‌ల శిక్షణా కేంద్రం

* రవీంధ్రనాథ్ ఠాగూర్-కాలిత భారత తీర్థ యాత్ర పేరుతో దేశ నలుమూలలను కలిపే సర్వీసులు
* సురక్షిత మంచినీటి కోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో వాటర్ బాటిలింగ్ ప్లాంట్లు
* ఓబీసీ, మహిళా అభ్యర్థులకు ఆర్‌బీఐ పరీక్షా ఫీజుల మినహాయింపు
* 2020 నాటికి కొత్తగా 25 వేల కిలోమీటర్ మేర కొత్త రైలు మార్గాలు
* ఢిల్లీ, సికింద్రాబాద్, చెన్నయ్, కోల్‌కతా, ముంబైలలో స్పోర్ట్స్ అకాడెమీలు.
* వచ్చే యేడాదిలో రాయ్‌బరేలీ రైల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభం
* బెంగుళూరులో డిజైన్ డెవలప్‌మెంట్ టెస్టింగ్ సెంటర్
* 12 మహిలా ఆర్పీఎఫ్ బెటాలియన్ పోలీసులు
* జుల్పాయ్‌గురిలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
* హై స్పీడ్ రైల్వే వ్యవస్థ ఏర్పాటు
* మొబైల్ వ్యాన్ల ద్వారా ఈ టికెట్లు
* పది ఎకో పార్కింగ్ కేంద్రాలు

* దేశ వ్యాప్తంగా గోల్డెన్ కారిడార్ ఏర్పాటు
* రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల విస్తరణ
* బోగీల సేకరణకు నూతన విధానం అమలు
* దీర్ఘకాలిక డిమాండ్‌ల పరిష్కారానికి కృషి
* కొత్త రైళ్ళ ఏర్పాటుకు పీపీపీ విధానం అమలు
* పంచాయతీల్లో టిక్కెట్ రిజర్వేషన్ సెంటర్లు
* వచ్చే ఐదేళ్ళలో మానవ రహిత లెవల్ క్రాసింగ్స్
* కొత్త రైల్వే లైన్ల పూర్తికి రూ.20 వేల కోట్లు

* భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య రైలుమార్గం ప్రతిపాదన
* బెంగుళూరులో రైల్వే చక్రాల తయారీ కేంద్రం
* సికింద్రాబాద్‌లో వ్యాగన్ తయారీ కేంద్రం
* రైల్వే ఉద్యోగులందరికీ గృహ వసతి
* ముంబైకు కొత్తగా 101 సబర్బన్ రైళ్లు
* రైల్వే కార్మికులకు ఆరోగ్య బీమా
* 21 రైళ్ల సామర్థ్యం పెంపు
* రూ.పదికే జనతా ఆహారం

వెబ్దునియా పై చదవండి