సాధారణ బడ్జెట్: పెరగనున్న పెట్రో-డీజల్ ధరలు!

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010 (13:49 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ ధరలు పెరగనున్నాయి. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ధరలు పెంచకుండానే ధరలు ఎలా పెరుగుతాయనే కదా మీ సందేహం. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2010-11 వార్షిక సాధారణ బడ్జెట్ పుణ్యమాని పెట్రోల్ ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచే ఒక్క రూపాయి మేరకు పెరగనున్నాయి.

పారిఖ్ కమిటీ సిఫార్సుల మేరకు పెట్రో ఉత్పత్తులపై 7.5 శాతం ఎక్సైజ్ పన్నును పెంచుతున్నట్టు విత్తమంత్రి ప్రకటించారు. దీంతో పెట్రోల్ ధరలు పెరగనున్నాయి. ఇదిలావుండగా, పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్టు ప్రకటించిన వెంటనే సభలో ప్రతిపక్షాలు పెద్దపెట్టున వ్యతిరేకించారు. అయితే, విత్తమంత్రి మాత్రం పట్టించుకోక పోవడంతో ధరల పెంపుకు నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి