సాధారణ బడ్జెట్: పొగరాయుళ్ళపై మరింత భారం!

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010 (16:01 IST)
సాధారణ బడ్జెట్‌లో కేంద్రం పొగరాయుళ్ళపై భారం మోపింది. పొగాకు ఉత్పత్తులపై మరింతగా పన్నులు భారం మోపింది. ఫలితంగా అన్ని రకలా పొగాకు ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. వీటితో పాటు పెట్రోల్, డీజల్, కార్లు, టీవీ, ఎయిర్ కండీషనర్, బంగారం, వెండి ధరలు కూడా పెరగనున్నాయి.

అదేసమయంలో మొబైల్ ఫోన్లు, వాటి విడి భాగాలు, వైద్య పరికరాలు, సీఎఫ్ఎల్ ల్యాంప్స్, సెట్ ఆఫ్ బాక్సులు, కాంపాక్ట్ డిస్క్‌లు, బొమ్మలు, పుస్తకాలు మరింత ప్రియం కానున్నాయి. వీటిపై పన్నుల భారం తగ్గించారు.

ఇదే విషయాన్ని గురువారం వెలువడిన ఆర్థిక సర్వే సూచన ప్రాయంగా వెల్లడించగా, శుక్రవారం ఆర్థిక మంత్రి స్పష్టంగా ప్రకటించారు. వీటిపై పన్నులు తగ్గించడం వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 26 వేల కోట్ల రూపాయల పన్ను భారం ప్రభుత్వంపై పడుతుందని ముఖర్జీ తెలిపారు.

ఇదిలావుండగా, ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పుణ్యమాని కార్ల ధరలు పది శాతం మేరకు పెరగనున్నాయి. ఇదే విషయాన్ని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి వెల్లడించింది. ఈ బడ్జెట్ ప్రభావం కారణంగా ఒక్కో కారు ధర రూ.25 వేల వరకు పెరగవచ్చని అంచనా వేసింది.

ప్రస్తుత ధర కంటే రెండు శాతం అధికంగా ధర పెరుగుతుందని మారుతి సుజుకి ఇండియా వెల్లడించింది. అలాగే హ్యూండాయ్ కంపెనీ కూడా రూ.6.5 వేల నుంచి రూ.25 వేల వరకు కారు ధర పెరగవచ్చని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి