సాధారణ బడ్జెట్: ప్రాథమిక విద్యకు నిధుల వరద

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010 (13:48 IST)
కేంద్ర విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన 2010-11 వార్షిక సాధారణ బడ్జెట్‌లో ప్రాథమిక విద్యకు నిధులు భారీగా కేటాయించారు. గత యేడాది ఈ రంగానికి రూ.26,800 కోట్లు కేటాయించగా ప్రస్తుతం రూ.31,300 కోట్లకు పెంచారు. అలాగే, యునిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పథకానికి రూ.1900 కోట్లను కేటాయించారు. మైనారిటీ సంక్షేమానికి రూ.2600 కోట్లు, సామాజిక న్యాయం, సాధికారకత శాఖకు 4500 కోట్ల రూపాయలను కేటాయించారు.

ఈ శాఖకు గత యేడాదితో పోల్చితే ఈ దఫా 80 శాతం మేరకు నిధులు పెంచడం గమనార్హం. అలాగే, మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు కూడా యాభై శాతం మేరకు నిధులు పెంచారు. జాతీయ ఆహార భద్రత నిధి కింద అసంఘటిత కార్మికుల కోసం రూ.వెయ్యి కోట్లను కేటాయించారు. కేంద్ర పారామిలిటరీ ఫోర్స్‌కు రెండు వేల మంది యువకులను ఎంపిక చేయనున్నట్టు తెలిపారు.

రెండు వేలకు పైబడి ఉన్న అన్ని గ్రామాల్లో బ్యాంకు సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. రాజీవ్ ఆవాస్ యోజనా పథకం కింద మురిక వాడల నిర్మాణం కోసంరూ.1270 కోట్లు కేటాయించారు. మురికి వాడలు లేని భారత్‌గా తీర్చి దిద్దేందుకు వీలుగా 700 శాతం మేరకు నిధులు పెంచినట్టు మంత్రి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి