బడ్జెట్ 2016 : ఆదాయ, వ్యయ వివరాలు... ప్రధాన రంగాల కేటాయింపులివే

సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (13:33 IST)
విత్తమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2016 వార్షిక బడ్జెట్‌ ఆదాయ, వ్యయ వివరాలతో పాటు ప్రధాన రంగాలకు విత్తమంత్రి కేటాయించిన వివరాలను పరిశీలిస్తే... 
* మొత్తం బడ్జెట్‌ రూ.19.78 లక్షల కోట్లు 
* ప్రణాళికా వ్యయం రూ.5.5 లక్షల కోట్లు 
* ప్రణాళికేతర వ్యయం రూ.14.28 లక్షల కోట్లు 
* ద్రవ్యలోటు 3.5 శాతం 
* రెవెన్యూ లోటు 2.5శాతం 
* రక్షణ రంగానికి రూ.2,46,727 కోట్లు  
* గ్రామీణాభివృద్ధి కోసం రూ.79,526 కోట్లు  
* ఆరోగ్యం రంగానికి రూ.33,150 కోట్లు 
* విద్యా రంగానికి రూ.68,968 కోట్లు
* హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్ రంగానికి రూ.22,407 కోట్లు
* మహిళల భద్రత కోసం నిర్భయ ఫండ్ కింద రూ.1000 కోట్లు 
* వాటర్ రిసోర్సస్ కోసం రూ.4173 కోట్లు 
* ముద్రా బ్యాంక్ ద్వారా రూ.1.80 లక్షల కోట్ల రుణాలు
* బ్యాంకుల మూలధన సమీకరణకు రూ.25 వేల కోట్లు 
* ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ వాటా 50 శాతానికి తగ్గింపు
* రూ.900 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
* 3.5 కోట్ల చౌకధరల దుకాణాల డిజిటలైజేషన్
* సాగర్ మాల ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లు
* రోడ్లు, జాతీయ రహదారులపై ప్రణాళికా వ్యయం 28 శాతం పెంపు
* ఆర్థిక సేవల విషయంలో ఆధార్ తప్పనిసరి
* దీన్ దయాళ్ ఉపాధ్యాయ, గురు గోవింద్ సింగ్ జయంత్యుత్సవాలకు రూ.100 కోట్లు
* అద్దె నుంచి పన్ను రాయితీ రూ.24 వేల నుంచి రూ.60 వేలకు పెంపు
* సొంత ఇల్లు లేని, హెచ్ఆర్ఏ సౌకర్యం పొందని ఉద్యోగులకు వర్తింపు
* రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే పన్ను కేవలం రూ.2 వేలు మాత్రమే
* గృహ రుణాలపై వడ్డీ మినహాయింపులు మరో రూ.50 వేలు పెంపు
* 60 చదరపు మీటర్ల విస్తీర్ణంలోపు మెట్రోల్లో ఇల్లుంటే సేవా పన్ను రాయితీ
* మిగతా ప్రాంతాల్లో 120 చదరపు మీటర్ల వరకూ రాయితీలు
* వార్షిక ఆదాయం రూ. కోటి దాటితే సర్‌చార్జ్ 12 నుంచి 15 శాతానికి పెంపు
* అన్ని రకాల సేవలపై 0.05 శాతం కృషి కల్యాణ్ సెస్
* విలాసవంతమైన కార్లు, సీఎన్జీ వాహనాలపై 1 శాతం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెస్
* సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం 10 నుంచి 15 శాతానికి పెంపు.

వెబ్దునియా పై చదవండి