జంక్ ఫుడ్, తీయనైన పానీయాలనగానే అనారోగ్య సమస్యలు గుర్తుకువస్తాయి. వీటిని అదుపుచేసేందుకు ఈసారి కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పదార్థాలపై పన్ను బాదుడు చేస్తే కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావం చేస్తూ అధిక బరువు, స్థూలకాయం, మదుమేహం తదితర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న ఈ పదార్థాలపై పన్ను వడ్డింపు అధికస్థాయిలో వుండబోతున్నట్లు తెలుస్తోంది.