పేదలకు కోటి ఇళ్ళు నిర్మాణం... గృహ నిర్మాణానికి పరిశ్రమ హోదా : విత్తమంత్రి

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (12:00 IST)
దేశంలో పేదల కోసం కోటి ఇళ్లను నిర్మించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అలాగే, గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించారు. 2017-18 సంవత్సరానికి గాను ఆయన బుధవారం వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. 
 
రూ.8 వేల కోట్లతో డెయిరీ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మైక్రో ఇరిగేషన్‌ కోసం రూ.5 వేల కోట్లు కేటాయింపు. పేదలకు సామాజిక భద్రత, గృహనిర్మాణం, ఉపాధి కల్పన, ఆర్థిక సంస్థల బలోపేతం, డిజిటల్‌ వ్యవస్థ, భూసార పరీక్షల కోసం కృషి విజ్ఞాన కేంద్రల్లో మినీ ల్యాబ్‌లు, 63 వేల ప్రాథమిక సహకార సంఘాల కంప్యూటీకరణ రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేస్తామన్నారు. 

వెబ్దునియా పై చదవండి