అత్యంత నమ్మకమైన వ్యాపరవేత్త రతన్ టాటా

మంగళవారం, 2 మార్చి 2010 (20:18 IST)
FILE
భారతదేశంలో అత్యంత నమ్మకమైన వ్యాపార వేత్తగా టాటా సంస్థల అధినేత రతన్ టాటాగా ప్రముఖ మ్యాగజైన్ అయిన రీడర్స్ డైజెస్ట్ పేర్కొంది.

దేశంలోని అత్యంత నమ్మకమైన వ్యాపారవేత్తగా టాటా సంస్థల అధినేత రతన్ టాటాకు పేరు ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రముఖ మ్యాగజైన్ అయిన రీడర్స్ డైజెస్ట్ మంగళవారం తెలిపింది. తమ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు సంస్థ పేర్కొంది.

దేశంలో అత్యంత నమ్మదగిన వ్యక్తుల్లో వంద మంది పేర్లను రీడర్స్ డైజెస్ట్ మంగళవారం ప్రకటించింది. వీరిలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ తొలి స్థానంలో నిలవగా వ్యాపార వేత్తల్లో రతన్ టాటా పేరు ప్రముఖంగా నిలవడం గమనార్హం. అదే అంబానీ సోదరులు వ్యాపార వేత్తల్లో అంబానీలు తరువాతి స్థానంలో నిలిచారు.

నమ్మదగిన వంద మంది వ్యక్తుల్లో ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఏడవ స్థానం లభించగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీకి 29వ స్థానం దక్కింది. వందమందిలో ప్రముఖ వ్యాపార వేత్తల్లో ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి(4), కుమారమంగళ బిర్లా(20), ఐటీ దిగ్గజమైన విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ(10) స్థానాల్లో నిలిచారు.

అదే రిలయన్స్ సోదరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీకి(74)వ స్థానం లభించింది. ఈ పోటీలో ప్రముఖ వ్యాపారవేత్తలతోపాటు నటులు, పత్రికా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఆటగాళ్ళు తదితరులున్నారు. వీరిలో ఆర్సెల్లార్ మిట్టల్ ఛైర్మెన్, ప్రధాన కార్యనిర్వహణాధికారి లక్ష్మీ మిట్టల్, భారతీ ఎయిర్‌టెల్ సంస్థల ఛైర్మెన్ సునీల్ మిట్టల్, బయోకాన్ ఛైర్మెన్ కిరణ మజుందార్ షా, హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన దీపక్ పరేఖ్, ఐసీఐసీఐ ప్రధాన కార్యనిర్వహణాధికారి చందాకోచ్చర్‌లున్నారు.

వెబ్దునియా పై చదవండి