ఆసియా మార్కెట్‌లో పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు

చమురు నిల్వలు అపారంగా కలిగియున్న లిబియా నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆసియా మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అలాగే, న్యూయార్క్ మార్కెట్‌లో కూడా వీటి ధరలు పెరిగాయి.

లిబియా చమురు క్షేత్రాల్లో పని చేస్తున్న విదేశీ కార్మికులంతా తమతమ దేశాలకు తరలిపోతున్నారు. దీంతో చమురు ఉత్పత్తి సగానికి పడిపోయినట్లు లిబియా జాతీయ ఆయిల్ కార్పోరేషన్ అధినేత షుక్రీ ఘనీమ్ వెల్లడించారు.

ఆయిల్ ఉత్పత్తి తగ్గినప్పటికీ ఉత్పత్తి సంస్థలపై ఎటువంటి దాడులు గాని నష్టం గాని వాటిల్లలేదని ఆ దేశ ఇంధన మంత్రి అయిన ఘనీమ్ చెప్పారు. తాము ఉత్పత్తి చేసి ఎగుమతులు కూడా కొనసాగిస్తామని తెలిపాడు.

లిబియా రోజుకు 1.6 మిలియన్ల బ్యారెళ్ళ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తుందని అందులో 85 శాతం యూరప్ దేశాలకే ఎగుమతి చేస్తుందని ఓ అంతర్జాతీయ చమురు సంస్థ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి