ఈజిప్టు ఎఫెక్ట్: ఆసియా మార్కెట్‌లో పెరిగిన చమురు ధరలు

ఈజిప్టులో నెలకొన్న ఆందోళనల ప్రభావం ఆసియా మార్కెట్‌ ముడిచమురు లావాదేవీలపై పడింది. ఫలితంగా ఆసియా మార్కెట్‌లో వీటి ధరలు పెరిగాయి. మంగళవారం ముడి చమురు బ్యారెల్ ధర 102 అమెరికన్ డాలర్లకు చేరుకుంది.

న్యూయార్క్‌కు సరఫరా చేసే ముడి చమురు మార్చి డెలివరీ ధర రెండు సెంట్లు పెరిగి 90.79 అమెరికా డాలర్లకు చేరుకుంది. అలాగే, బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర కూడా 25 సెంట్లు పెరిగి 101.99కు చేరుకుంది.

చమురు ఉత్పత్తిలో ఈజిప్టు ప్రధాన పాత్రదారుకాకపోయినప్పటికీ.. ఈజిప్టులో కీలకమైన సూయజ్ కెనాల్ ఉంది. ఈ కెనాల్ ద్వారా ప్రతి రోజూ 2.4 మిలియన్ బ్యారెర్ల చమురు రవాణా అవుతుంది. ఇది ఇరాక్, బ్రెజిల్‌ దేశాల్లో ప్రతిరోజూ ఉత్పత్తి చేస్తున్న చమురు ఉత్పత్తితో సమానంగా పోల్చవచ్చు.

వెబ్దునియా పై చదవండి