ఎల్కేమ్ సోలార్స్‌తో కలిసి పనిచేయనున్న బివిఆర్ఐటి

గురువారం, 9 ఫిబ్రవరి 2012 (14:56 IST)
ఎల్కేమ్ సోలార్స్‌తో కలిసి పనిచేసే మహత్తర అవకాశం పద్మశ్రీ డాక్టర్ బి.వి.రాజు ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి దక్కింది. కాగా సోలార్ గ్రేడ్ సిలికాన్ టెక్నాలజీ వినియోగంపై నార్వేకు చెందిన ఎల్కేమ్ సోలార్స్‌తో కలిసి పనిచేసే అవకాశం బివిఆర్‌ఐటి‌కి వచ్చింది.

ఎల్కేమ్ సంస్థ సోలార్ గ్రేడ్ సిలికాన్‌ల పివి మోడ్యూల్స్ పనితీరు అధ్యయన బాధ్యతను టైటాన్ ఎనర్జీ సిస్టమ్స్‌కు అప్పగించారు. కాగా టైటాన్ సంస్థ బివిఆ‌ర్ఐటితో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చింది.

దీనిపై బివిఆర్ఐటి ప్రిన్సిపాల్ కల్నల్ టిఎస్. సురేంద్ర మాట్లాడుతూ.. ఈ అవగాహన ఒప్పందం కారణంగా విద్యార్థులలో టెక్నాలజీపై మంచి పట్టు వస్తుందన్నారు. ఇంకా దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగించే ఈ ఒప్పందం వల్ల సోలార్ గ్రేడ్ సిలికాన్ టెక్నాలజీపై భారతీయులకు మంచి అవగాహన కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి