వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అతలాకుతలం చేస్తున్న తరుణంలో ఆసియా దేశాల ప్రతినిధులు పాల్గొనే ఏడిబి (ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) సమావేశం సోమవారం నుంచి ప్రారంభంకానుంది. దీనికి భారత్‌తో సహా, దక్షిణాసియా దేశాలకు చెందిన ఆర్థికవేత్తలు హాజరుకానున్నారు.
ఆర్థిక మాంద్యం దక్షిణాసియాదేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా భారత్ వృద్ధి రేటుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు దేశాల స్టాక్ మార్కెట్‌లు కుప్పకూలుతున్నాయి.
ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు జరుగనున్న ఏడిబి సమావేశాన్ని ఆ బ్యాంకు అధ్యక్షుడు హరుహికో కురోడా వెల్లడించారు. ఈ సమావేశంలో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలకు చెందిన ఆర్థిక నిపుణులు పాల్గొన్నారు.