తగ్గిన దేశీయ దుస్తుల ఎగుమతులు

శనివారం, 10 ఏప్రియల్ 2010 (09:57 IST)
దేశీయ దుస్తుల పరిశ్రమకు చెందిన ఎగుమతులు ఈ ఏడాది ఫిబ్రవరిలో 10శాతానికి తగ్గి 876 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అమెరికా‌, యూరోప్‌ మార్కెట్లలో దేశీయ దుస్తులకు డిమాండ్‌ తగ్గడంతో ఎగుమతుల్లో తగ్గుదల చోటు చేసుకుందని అప్పారెల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఏఈపీసీ) ఛైర్మన్‌ ప్రేమల్‌ ఉదాని తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరం(2009-10)లో జరిగిన ఎగుమతుల్లో 13 శాతానికి పడిపోయి 8.7బిలియన్‌ డాలర్ల మేరకు వ్యాపారం జరిగిందని ఆ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. జౌళి పరిశ్రమ రంగంలో సుమారు 3.65 మిలియన్‌ మంది ఉద్యోగులు ఉండగా, 11శాతం నష్టంతో ఈ ఆర్థిక సంవత్సర ఎగుమతులు ముగిశాయనీ, పశ్చిమ మార్కెట్లలో బలహీనమైన డిమాండ్‌ కారణంగా ఈ పరిస్థితి నెలకొందనీ ఆయన అన్నారు.

నిరుడు ఆగస్ట్‌, నవంబర్‌ మాసాల్లోనే తప్ప మిగతా అన్ని మాసాల్లోను అలాగే ఫిబ్రవరి నెలలోను ఎగుమతుల కాంట్రాక్టులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. గతంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా తమ పరిశ్రమ ఇంకా కోలుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి