తొలి ఇంటర్నెట్‌ రేడియోను ప్రారంభించిన రిలయన్స్

అనిల్ అంబానీ గ్రూపుకు చెందిన అనుబంధ సంస్థ రిలయన్స్‌ బ్రాడ్‌కాస్ట్‌ నెట్‌వర్క్స్‌ దేశంలోనే తొలిసారిగా ఇంటర్నెట్‌ రేడియోను ప్రారంభించింది. ఈ ఇంటర్నెట్‌ రేడియోను సంస్థ చైర్మన్‌ అనిల్‌ అంబానీ ప్రారంభించారు.

రేడియో రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు గానూ.. సరికొత్త వ్యూహంతో ప్రాజెక్టును ప్రారంభించామని కంపెనీ హెడ్‌ (రేడియో, డిజిటల్‌) సౌమెన్‌ జి. చౌదరి అన్నారు. ప్రస్తుతం దేశంలో 5 కోట్ల మంది అంతర్జాల (ఇంటర్నెట్‌) వినియోగదారులు ఉన్నారని, ఇందులో 18 నుంచి 30 ఏళ్ల వయస్సు గలవారే ఎక్కువగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఇంటర్నెట్ రంగంలో ఉన్న ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకే.. ఇంటర్నెట్‌ రేడియోను ప్రారంభించామని చౌదరి అన్నారు. దీని ద్వారా ఆన్‌లైన్‌ ప్రకటనలకు (అడ్వటైజింగ్‌) ఆదరణ మరింత పెరుగుతోందని, 2013 నాటికి తమ సంస్థ ఆదాయం 32 శాతం వృద్ధితో రూ. 2,000 కోట్లకు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు.

వెబ్దునియా పై చదవండి