దేశీయంగా తగ్గిన కార్ల విక్రయాలు: పెరిగిన బైకుల సేల్స్

సోమవారం, 10 అక్టోబరు 2011 (16:46 IST)
దేశీయ మార్కెట్‌లో కార్ల విక్రయాలు గత నెలలో గణనీయంగా తగ్గిపోయాయి. అదేసమయంలో మోటార్‌ సైకిల్స్ విక్రయాలు 19.22 శాతం మేరకు పెరిగాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ గత సెప్టెంబరు నెలలో చోటు చేసుకున్న ఆటోమొబైల్ విక్రయాల గణాంకాలను వెల్లడించింది.

ఈ గణాంకాల మేరకు సెప్టెంబరు నెలలో కార్ల విక్రయాలు 1.8 శాతం మేరకు తగ్గగా, ద్విచక్ర వాహనాల విక్రయాలు 19.92 శాతం మేరకు పెరిగాయి. గత యేడాది సెప్టెంబరు నెలలో మొత్తం 778351 మోటార్‌ సైకిల్స్ విక్రయాలు కాగా, గత సెప్టెంబరు నెలలో వీటి సంఖ్య 933465కు చేరుకుంది.

అలాగే, స్వదేశీ మార్కెట్‌లో కార్ల విక్రయాలు 1.8 శాతం మేరకు తగ్గాయి. గత యేడాది 168959 కార్లు విక్రయం కాగా, ఈ యేడాది సెప్టెంబరు నెలలో ఈ సంఖ్య 165925కు పడిపోయింది.

అలాగే, ద్విచక్ర వాహనాల విక్రయాలు 24.27 శాతానికి పెరిగాయి. ఇవి గతయేడాది సెప్టెంబరు నెలలో 992382గా ఉండగా, ప్రస్తుతం ఈ గణాంకాలు 1233283గా నమోదైనట్టు తెలుపుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి