నీలగిరిలో సప్తర్షి ఆగ్రో ఇండస్ట్రీస్ పుట్టగొడుగుల ఉత్పత్రి కేంద్రం

శుక్రవారం, 19 ఏప్రియల్ 2013 (16:30 IST)
WD
WD
పుట్టగొడుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న సంస్థల్లో ఒకటైన సప్తర్షి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ తన రెండో ఉత్పత్తి కేంద్రాన్ని నీలగిరి జిల్లాలో ప్రారంభించనుంది. ప్రస్తుతం కంపెనీకి కాంచీపురం జిల్లాలో ఒక ఉత్పత్తి కేంద్రం ఉంది.

ఇదే అంశంపై సప్తర్షి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మ్ అరవింద్ కాలార్ శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తమ రెండో యూనిట్‌ను నీలగిరి జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పుట్టగొడుగుల ఉత్పత్తికి ఈ ప్రాంత వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుందన్నారు.

సాధారణంగా పుట్టగొడుగుల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఉష్ణోగ్రత 20 డిగ్రీల లోపు ఉండాలన్నారు. ఇక్కడ యేడాదిలో ఏడెనిమిది నెలలో 16 నుంచి 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందన్నారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని తాము ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు.

తమకు పుట్టగొడుల ఉత్పత్తిలో 1993 నుంచి అనుభవం ఉందన్నారు. తాము స్థాపించిన తొలి కేంద్రాన్ని టాటా టీ కంపెనీ కొనుగోలు చేసిందన్నారు. అయితే, ఆ కంపెనీ తీవ్ర నష్టాలను చవిచూడటం వల్ల మరో సంస్థకు అప్పగించగా, దీన్ని 2003లో తామే తిరిగి స్వాధీనం 2008 నుంచి లాభాలను అర్జించడం ప్రారంభించినట్టు చెప్పారు.

చెన్నైలో పుట్టగొడుగుల మార్కెట్ నానాటికీ వృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం రోజుకు 15 టన్నుల పుట్టగొడుల వరకు విక్రమయమవుతున్నట్టు చెప్పారు. ఇందులో అత్యధికగా తామే ఉత్పత్తి చేస్తూ విక్రయిస్తున్నట్టు చెప్పారు. నగరంలోని అన్ని ప్రధాన సూపర్ మార్కెట్లకు, ప్రధాన నక్షత్ర హోటల్స్‌కు పుట్టగొడులను తామే సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.

కాంచీపురం జిల్లాలోని తమ కేంద్రం నుంచి ఉత్పత్తి చేసే పుట్టగొడుగులను తమిళనాడుతో పాటు.. కర్ణాటక, ఒరిస్సా, ముంబై, కోల్‌కతాలకు సరఫరా చేస్తున్నట్టు ఆయన వివరించారు. అయితే, రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం కారణంగా పూర్తి స్థాయిలో పుట్టగొడులను ఉత్పత్తి చేయలేక పోతున్నట్టు చెప్పారు. ఈ విద్యుత్ కోతల నుంచి బయటపడేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.

అందువల్ల తాము కొత్తగా నీలగిరిలో ఓ యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయానికి వచ్చినట్టు ఆయన తెలిపారు. పుట్టగొడుగుల ఉత్పత్తికి ప్రధానంగా నైపుణ్యంతో కూడిన అనుభవం ముఖ్యమని ఆయన అరవింద్ వివరించారు.

వెబ్దునియా పై చదవండి