ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు జీతాలపెంపు

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనున్న ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు వేతనాలను పెంచేందుకుగాను దీపావళి బహుమానంగా వేతనాలను పెంచాలని కేంద్రం భావిస్తోంది.

ప్రభుత్వ బ్యాంకుల అధికారులకు, ఉద్యోగులకు చెల్లించే వేతనాల్లో దాదాపు 17.5 శాతం జీతాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి దీపావళి పండుగ ముందే ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.

గత కొద్ది రోజులుగా బ్యాంకు సిబ్బందికి, ప్రభుత్వానికి జీతాల పెంపు విషయమై చర్చలు జరగడం, విఫలమవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే బ్యాంకు అధికారులు, ఇతర సిబ్బందికి జీతాలు 17.5 శాతం పెంచాలని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబీఏ) డిమాండ్ చేస్తూ వచ్చిన విషయం విదితమే. ఐబీఏ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం సమ్మతించినట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రభుత్వం పెంచనున్న వేతనాలలో మూలవేతనంతోపాటు ఇతర అలవెన్సులు కూడా పెరిగే సూచనలున్నట్లు ఆ శాఖాధికారులు తెలిపారు. కాని జీతాల పెంపు ఎప్పటినుంచి అనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా పేర్కొనలేదు. ఈ విషయాన్ని బ్యాంక్ యూనియన్లతో చర్చలు జరిపిన మీదటే ఈ విషయాన్ని వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

ఇదిలావుండగా ఆరవ ప్రణాళికా సంఘం సిఫారసుతో జనవరి నెల 2006 నుంచి కేంద్ర ప్రభుత్వోద్యోగులకు వేతనాలు సవరించి పెంచడం జరిగింది. దీనికిగాను కేంద్ర ప్రభుత్వోద్యోగులకు భారీ మొత్తంలో రొక్కం చెల్లించాల్సి వచ్చింది. ఇలాంటి లాభాలే బ్యాంక్ సిబ్బందికి కూడా వర్తించేలా చర్యలు చేపట్టాలని పలు బ్యాంక్ యూనియన్లు కోరుతున్నాయి.

కాగా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఉద్యోగులకు ఇంతకంటే ఎక్కువగా వేతనాలు చెల్లించే స్థితిలో లేదని ఐబీఏ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి