భారత్‌లో పెట్టుబడులు పెట్టనున్న జీసీసీ ఛాంబర్స్

సోమవారం, 8 ఫిబ్రవరి 2010 (14:36 IST)
గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్‌లో భారతదేశాన్ని కూడా భాగస్వామిని చేసేందుకుగాను భారతదేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కతర్ సిద్ధంగా ఉంది.

సంపన్న దేశాల స్థానంలోనున్న భారతదేశంలోను తమ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని జీసీసీ ఛాంబర్స్ ప్రధాన కార్యదర్శి అబ్దుర్రహీమ్ నాకీ సోమవారం మీడియాకు తెలిపారు. ఇందులో భాగంగా తమ సంస్థ భారతదేశంలో రెండు వందల కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టేందుకు నిర్ణయించిందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అరబ్ ప్రాంతంలోని ప్రతి వ్యక్తి ఆదాయపరంగా తీసుకుంటే ఉన్నత స్థానంలోనే ఉంటారని, దీంతో కతర్ ప్రణాళికలననుసరించి భారతదేశంలోని వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్‌లో భారతదేశాన్ని భాగస్వామిగా చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి