మన వ్యాపారం రష్యాతో మరింత బలపడాలి: ప్రధాని

మంగళవారం, 8 డిశెంబరు 2009 (12:09 IST)
రష్యాతో మన దేశ వ్యాపార బంధం మరింత బలపడాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు.

రష్యా- భారత్ రెండు దేశాల మధ్య వచ్చే ఐదు సంవత్సరాల(2015) నాటికి వ్యాపార బంధాన్ని 20 బిలియన్‌ డాలర్లకు చేర్చేందుకు ఇరు దేశాలూ నిర్ణయించాయని ఆయన మాస్కోలో అన్నారు. ఈ మేరకు రష్యా అధ్యక్షుడితో కలసి ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇరు దేశాల మధ్య వ్యాపార బంధం మరింత బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఎనర్జీ, ఐటీ, కమ్యునికేషన్‌, ఫార్మా రంగాల్లో పరస్పర సహకారం అవసరమని మన్మోహన్‌ తెలిపారు.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో భారత్‌, రష్యా కీలక పాత్ర పోషించగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుడు ఆర్థిక సంవత్సరంలో తమ ఇరు దేశాల మధ్య 7 బిలియన్‌ డాలర్ల మేరకు వ్యాపార లావాదేవీలు జరిగాయని ఆయన వివరించారు.

ఇదిలావుండగా తమ దేశం నుంచి రష్యాకు ఎగుమతి అయ్యే వాటిలో పొగాకు, తేయాకు, కాఫీ, ఔషధాలులాంటివి ఉన్నాయి. కాగా రష్యా నుంచి భారతదేశానికి దిగుమతయ్యే ఎరువులు, ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు, విమాన పరికరాలు ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి