స్వల్పంగా పెరిగి 16.35 శాతానికి చేరుకున్న ఆహార ద్రవ్యోల్బణం

గురువారం, 1 ఏప్రియల్ 2010 (13:29 IST)
FILE
మార్చి 20తో ముగిసిన వారాంతానికి పప్పుదినుసులు, పాల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 16.35 శాతానికి చేరుకుంది.

మార్చి 13 నాటికి ద్రవ్యోల్బణం 16.22 శాతానికి తగ్గి నాలగు నెలల క్రితం నాటికి చేరుకుంది. నిత్యావసర సరుకుల ధరల్లో ప్రధానంగా పప్పు దినుసుల ధరలు 31.55 శాతం పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది.

వార్షిక ధరలతో పోలిస్తే పాలధర 18.74 శాతం పెరిగింది. వారాంతపు సూచీలో బార్లీ, పాల ధర 3 శాతం పెరిగింది. పెసలు, మసాలాదినుసులు, ఆహారంలో కలిపే సుగంధ పదార్థాలు 2 శాతం, ఉద్దిపప్పు, కందులు 1 శాతం చొప్పున పెరిగాయి.

జనవరిలో ద్రవ్యోల్బణం 8.56 శాతం నుంచి ఫిబ్రవరిలో 9.89 శాతానికి చేరుకుంది. ఏదేమైనప్పటికీ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. కేంద్రప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకం పెంచుతున్నట్లు ప్రకటించడంతో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో చమురు ద్రవ్యోల్బణం పెరిగింది. అలాగే ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది.

వెబ్దునియా పై చదవండి