9 శాతం వృద్ధి రేటును సాధిస్తాం: ప్రణబ్

అనిశ్చితి నుంచి క్రమంగా భారతదేశం బయటపడటమే కాక అభివృద్ధివైపు పయనిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతూ... ఆర్థిక వృద్ధి రేటును 9 శాతం సాధించే దిశగా మన దేశం ప్రయాణిస్తోందని చెప్పారు.

మాంద్యం దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం కుదేలైనప్పటికీ మన దేశం ఆ పరిస్థితిని అదిగమించిందన్నారు. ఒకవైపు మాంద్యం కొనసాగుతున్నప్పటికీ ప్రత్యక్ష విదేశీపెట్టుబడులకు ఎటువంటి దెబ్బ తగలలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా గత డిసెంబరు నాటికి ఉత్పాదక అభివృద్ధి 18.5 శాతం మేర సాధించామన్నారు.

2010-11 బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నట్లు ప్రకటించారు. ఆహార ధాన్యాల ధరల పెరుగుదలను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి