ఎయిరిండియాతో రాకతో టాటా గ్రూప్ లోకి మూడో విమానాయన బ్రాండ్ వచ్చినట్లవుతుంది. ఎయిరిండియా మొత్తం అప్పుల ఊబిలో కూరుకపోయింది. దీంతో 100 శాతం వాటాలు పొందేందుకు రూ. 18 వేల కోట్లతో టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ టాలెస్ ప్రైవేటు లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది. గత సంవత్సరం అక్టోబర్ 08వ తేదీన కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఇకపోతే.. ఎయిర్ ఇండియా అసలు పేరు టాటా ఎయిర్ లైన్స్. 1932లో టాటా ఎయిర్ లైన్స్ ను పారిశ్రామిక దిగ్గజం జేఆర్డీ టాటా స్ధాపించగా, స్వాతంత్ర్యం అనంతరం కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయీకరణ చేసింది. దీని పేరును ఎయిర్ ఇండియాగా మార్చింది. 68 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిరిండియా టాటా చేతికొచ్చింది.