గతంలో చైనాలో వ్యాపారాల కోసం పరివర్తన ప్రయాణం మూడు నుంచి ఐదేళ్లు పడుతుండగా ఇప్పుడు సంవత్సరం పడుతున్నదని అలీబాబా క్లౌడ్ ఇంటెలిజెన్స్ విభాగం అధ్యక్షుడు జెఫ్ జాంగ్ తెలిపారు. అన్ని రంగాల్లో గ్లోబల్ క్లయింట్ల నుంచి డిజిటల్‌షిప్ట్ వేగంగా పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రపంచ స్థాయి క్లౌడ్ సేవలను అందించే నిబద్ధతతో కొనసాగాలని నిర్ణయించుకొన్నామన్నారు.
మెషిన్ ఇంటెలిజెన్స్, విజన్ కంప్యూటింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, హ్యూమన్-మెషిన్ ఇంటరాక్షన్, ఐవోటీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో ప్రాథమిక సాంకేతిక పరిశోధన కోసం 2017లో అలీబాబా డామో అకాడమీని స్థాపించారు.
గత కొన్నేండ్లుగా అలీబాబా డామో అకాడమీ నుంచి స్పీచ్ ఏఐ, ఇమేజ్ సెర్చ్, సిటి ఇమేజ్ అనలిటిక్స్ సహా పలు మార్గదర్శక సాంకేతికతలు ప్రపంచానికి అందించారు. ఇప్పటివరకు 63 జోన్లలో అలీబాబా క్లౌడ్ సేవల లభ్యత ఉండగా.. వీటిలో రెండు భారత్‌లో ఉన్నాయి.