లక్ష కన్నా ఎక్కువ సీజనల్ ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్న అమెజాన్ ఇండియా
శుక్రవారం, 6 అక్టోబరు 2023 (22:19 IST)
అమెజాన్ ఇండియా భారతీయుల పండగ సీజన్ కోసం తన కార్యకలాపాల నెట్‌వర్క్‌లో 1,00,000 కన్నా ఎక్కువ సీజనల్ ఉద్యోగ అవకాశాలను సృష్టించామని ప్రకటించింది. దీనితో భారతదేశం వ్యాప్తంగా ముంబయి, ఢిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో మరియు చెన్నై వంటి నగరాల్లో ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. అక్టోబరు 8, 2023న ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌కి ముందస్తుగా, ప్రైమ్ వినియోగదారులకు అక్టోబరు 7న ప్రారంభ యాక్సెస్ ఉంటుంది. అమెజాన్ ఇండియా ఇప్పటికే ఈ కొత్త ఉద్యోగులను తన నెట్‌వర్క్‌లోకి చేర్చుకుంది. వీరు తమ విధులలో భాగంగా పిక్, ప్యాక్, షిప్పింగ్ మరియు వినియోగదారుల ఆర్డర్‌లను సురక్షితంగా, సమర్ధవంతంగా బట్వాడా చేస్తారు. కొత్త నియామకాలలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌లు కూడా ఉన్నారు. వీరిలో కొందరు వర్చువల్ కస్టమర్ సర్వీస్ మోడల్‌లో భాగంగా ఉన్నారు. వారు దేశవ్యాప్తంగా తమ పాదముద్రను పటిష్టం చేయడం ద్వారా ఉన్నతమైన వినియోగదారుని అనుభవాన్ని అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పండుగల సీజన్ ఎల్లప్పుడూ అమెజాన్‌లో ప్రత్యేకమైన సమయం. నీల్సన్ మీడియా నిర్వహించిన ఇటీవలి అధ్యయనంలో 75% మంది వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్ అనుకూలమైన వన్-స్టాప్ షాప్‌గా ఉంటుందని పేర్కొనగా, 81% మంది వినియోగదారులు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలనే ఉద్దేశ్యాన్ని సూచిస్తున్నారు. మా ఫుల్‌ఫిల్‌మెంట్, డెలివరీ మరియు వినియోగదారులకు సేవా సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు, మాతో షాపింగ్ చేసేందుకు ఎదురుచూస్తున్న లక్షలాది మంది వినియోగదారులకు గొప్ప షాపింగ్ అనుభవాన్ని అందించడానికి మేము 100,000 కన్నా ఎక్కువ మంది అదనపు ఉద్యోగులను స్వాగతిస్తున్నాము. వినియోగదారుని సంతృప్తిని పెంపొందించడంతో పాటు, పని అవకాశాలు, ఆర్థిక స్వాతంత్ర్యంతో వ్యక్తులను శక్తివంతం చేయడంలో సీజనల్ నియామకం కీలక పాత్ర పోషిస్తుంది. మరీ ముఖ్యంగా పండుగ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. భారతదేశం వ్యాప్తంగా మా వినియోగదారులు, విక్రేతలు, సహచరులు, భాగస్వాములు మరియు ఉద్యోగుల కోసం సంతోషకరమైన పండుగ సీజన్‌ని సృష్టించేందుకు మేము ఎదురుచూస్తున్నాము అని అమెజాన్‌లో ఏపీఏసీ/ఎంఇఎన్ఏ/ఎల్ఏటీఏఎం ఆపరేషన్స్ ఉపాధ్యక్షుడు మరియు డబ్ల్యుడబ్ల్యు కస్టమర్ సర్వీస్ హెడ్, అఖిల్ సక్సేనా తెలిపారు.
వినియోగదారులకు అసాధారణమైన సేవలను అందించడంలో అమెజాన్ నిబద్ధతకు సహకరించే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రతపై శ్రద్ధ తీసుకుంటూ, చక్కని పని వాతావరణం, అందుబాటులో సౌకర్యాలు నిజంగా ప్రశంసనీయమైనవి. వృత్తిపరంగా కూడా ముందుకు సాగుతూనే నా కుటుంబాన్ని ఆదుకోగలిగినందుకు ఆనందంగా ఉంది” అని ఇటీవల అమెజాన్ ఇండియాలో సీజనల్ పద్ధతిలో ఉద్యోగంలో చేరిన సెలిమ్ ఎస్.కె తెలిపారు.
అమెజాన్ ఇండియా దృఢమైన ఫుల్‌ఫిల్‌మెంట్ మరియు డెలివరీ నెట్‌వర్క్‌ను నిర్మించి, ముఖ్యమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది. కంపెనీ 15 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను కలిగి ఉండగా, సెల్లర్ల కోసం 43 మిలియన్ క్యూబిక్ అడుగుల స్టోరేజ్ స్థలాన్ని అందిస్తోంది. ఇది దేశంలోని 1.3 మిలియన్ల మంది విక్రయదార్లకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అమెజాన్ ఇండియా 19 రాష్ట్రాల్లో సార్టేషన్ సెంటర్‌లను కలిగి ఉంది. దానితో పాటు దాదాపు 2000 అమెజాన్-ఆపరేటెడ్ మరియు పార్టనర్ డెలివరీ స్టేషన్‌ల నెట్‌వర్క్ ఉంది. అలాగే, దీనికి 28,000 మంది ఐ హావ్ స్పేస్ భాగస్వాములు మరియు వేలాది మంది అమెజాన్ ఫ్లెక్స్ భాగస్వాములు ఉన్నారు. వారు దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు చిరునవ్వులను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది అమెజాన్ సింబయాటిక్ పబ్లిక్ మరియు ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా మరింత బలోపేతం చేయబడింది.
ప్రజలు ఆన్‌లైన్ రిటైల్‌ను ఎలా కనెక్ట్ చేసుకుని, హత్తుకుంటారు అనే అంశంలో అమెజాన్ ఇండియా ఇటీవల భారతీయ షాపింగ్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చే ఒక దశాబ్దాన్ని గుర్తించింది. వరుస వ్యూహాత్మక ఎత్తుగడలలో, అమెజాన్ ఇండియా ఇండియా పోస్ట్‌తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది మరియు డెలివరీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారతీయ రైల్వేలతో కలిసి పనిచేస్తుంది.