లంచం తీసుకోవడం.. ఇవ్వడం కూడా నేరమని తెలిసిందే. అయితే ఇక్కడ లంచం తీసుకున్న వ్యక్తిని నిర్దోషిగా హైకోర్టు ప్రకటించింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 2007లో రూ.100 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ప్రభుత్వ వైద్యుడు దొరికిపోయాడు.
ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా తేలుస్తూ 2012లో స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. కింది కోర్టు తీర్పును హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది.
రూ.100 లంచం చాలా చిన్న విషయమంటూ నిందితుడికి హైకోర్టు విముక్తి కల్పించింది. రూ.100 లంచం తీసుకోవడం చాలా చిన్న విషయమని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం నిందితుడిని నిర్దోషిగా పరిగణిస్తున్నామని తీర్పు వెలువరించింది.