మా అమ్మాయి, అబ్బాయి నా దృక్పథాన్నే మార్చేశారు: అంబానీ

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (03:00 IST)
ఆధునిక వ్యాపరవేత్తగా నా దృక్పధాన్ని, అవగాహనను మా అమ్మాయి, అబ్బాయే పూర్తిగా మార్చివేశారని రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చెప్పారు. కొత్త సమస్రాబ్దం సమస్యలను పరిష్కరించడంలో, నూతన అవకాశాలను కనుగొనడంలో మొత్తం నా అవగాహననే వాళ్లిద్దరూ మార్చివేశారని ఇంత చేసి వారి వయస్సు 25 ఏళ్లు మాత్రమేనని ముఖేష్ కొనియాడారు. 
 
ఇంజనీర్లు, టెక్ గురులతో సహా మనందరికీ పెద్ద గుణపాఠం ఏదంటే సగటు మనిషికున్న శక్తిని మనం అర్థం చేసుకోవలసి రావడమే. ఏ టెక్నాలజీ అయినా మానవుల అవసరాలతో సర్దుబాటు కావాల్సిందే కాని టెక్నాలజీ అవసరాలతో మనిషి సర్దుకుపోవడం కాదని అంబానీ వివరించారు. 
 
మనకళ్ల ముందే ఎదుగుతున్న కొత్త టెక్నాలజీ ఎంత వైవిధ్యపూరితమైన అవకాశాలను కల్పిస్తోందో మనం గ్రహించలేకపోతున్నామని ముఖేత్ చెప్పారు. మేము జియోను ప్రారంభించినప్పుడు స్వల్పకాలంలో పది కోట్ల వినియోగదారులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే అధార్ కార్డ్, ఇ-కేవైసీ లేకుండా మేం దాన్ని సాధించి వుండేవాళ్లం కాదు. వీటివల్లే మేం రోజుకు పది లక్షలమంది వినియోగదారులను ఆకర్షించగలిగామని అంబానీ స్పష్టం చేశారు. 
 
రిలయెన్స్ జియో భావన, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం వెనుక ముఖేష్ కూతురు, కుమారుల సృజనాత్మక ఆలోచన ఉందనేది తెలిసిందే

వెబ్దునియా పై చదవండి