భారత్‌కు బై బై... హార్లే డేవిడ్‌సన్ బైక్ కార్యకలాపాలు నిలిపివేత!

గురువారం, 20 ఆగస్టు 2020 (17:09 IST)
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోటార్ సైకిల్ సంస్థ హార్లే డేవిడ్‌సన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఆశించిన స్థాయిలో ప్రజాధారణ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. దీనికతోడు భారత్‌లోని ఇతర మోటార్ కంపెనీల నుంచి ఎదరవుతున్న పోటీని ధీటుగా ఎదుర్కోలేక పోయింది. ఫలితంగానే హార్లే డేవిడ్‌సన్ బైకుల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీనికితోడు కరోనా కష్టకాలం కూడా మరో కారణంగా నిలిచింది. 
 
ఇదే అంశంపై ఆ సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ద్వితీయ త్రైమాసికంలో వచ్చిన ఆదాయం అంతంతమాత్రంగానే ఉందన్నారు. భారత్‌లో లాభదాయకతకు పెట్టుబడుల విలువకు అంతగా ప్రాధాన్యం ఉండదు. ఒక్క ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ విపణిలో సైతం తన ఉనికిని గురించి హార్లే డేవిడ్‌సన్ పరిశీలిస్తోంది అని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే, గతయేడాది భారత్‌లో కేవలం 2,500 యూనిట్ల విక్రయాలు మాత్రమే జరిగాయనీ, ఇక ఏప్రిల్-జూన్ మధ్య కేవలం 100 బైక్‌లు మాత్రమే అమ్ముడుపోయానని హార్లే డేవిడ్‌సన్ ప్రకటించింది. అయితే అమెరికా, యూరప్‌, పసిఫిక్ ఆసియాలలో కొత్త మార్కెట్‌లను సృష్టించుకునేందుకు హార్లే ప్రయత్నాలు ప్రారంభించిందట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు