తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ.1000, 500 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే రేగింది. దాదాపు నెల రోజుల పాటు సామాన్యులు కూడా నోట్లు మార్చుకునేందుకు నానాపాట్లు పడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వం వెయ్యి నోటును పూర్తిగా ఎత్తేసి రూ.2 వేల నోటును చలామణిలోకి తెచ్చింది.
అయితే ఇటీవలకాలంలో 2 వేల నోటు మార్కెట్‌లో కంటికి కనిపించడం లేదు. దీంతో ఈ నోటును రద్దు చేస్తున్నారనే పుకార్లు హల్చచల్ చేస్తున్నాయి. రూ.2 వేల నోటును రద్దు చేసే యోచనలో కేంద్రం ఉందని, అందువల్ల రిజర్వ్‌బ్యాంక్‌కు చేరుతున్న నోట్లను చేరినట్టే అట్టేపెట్టేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.