డియోడరెంట్లు వాడినా ప్రయోజనం ఉండకపోవచ్చు. అలాంటి వారు ఈ చిట్కాలను పాటించి చూడండి మార్పు మీకే తెలుస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెను బకెట్ నీళ్లలో కలిపి, ఆ నీటితో స్నానం చేస్తే చెమట కానీ, చెమట వాసన కానీ మీ దరిచేరదు.
వేసవిలో కాటన్ దుస్తులను ఎక్కువగా ధరించడం వల్ల శరీరానికి బాగా గాలి తగిలి దుర్వాసన రాకుండా ఉంటుంది. టీ, కాఫీలు త్రాగితే చెమట ఎక్కువగా పడుతుంది. కాబట్టి చెమట వాసన నుంచి తప్పించుకోవడానికి టీ, కాఫీలను తక్కువగా తీసుకోండి.
మంచి డైట్‌ను పాటిస్తే శరీరం దుర్వాసన రాకుండా ఉంటుంది. ఆహారంలో 20 శాతం మాంసకృతులు, 20 శాతం నూనెలు, కొవ్వు పదార్థాలు, పండ్లు ఉంటే చెమటను దూరం చేయవచ్చు.