ఏటీఎంలలో నంబర్ సిరీస్‌లేని రూ.500 నోట్లు

మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (11:27 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ.500, రూ.2000 నోట్లు చెలామణిలోకి వచ్చాయి. నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకుగాను ఈ కొత్త నోట్లను ప్రవేశపెట్టారు. అయితే, కొత్తగా వచ్చిన రూ.2000, రూ.500 నోట్ల విషయంలో జర జాగ్రత్తగా ఉండాల్సిన ఎంతో అవసరం ఉంది. ఇప్పటికే దేశంలోకి నకిలీ రూ.2000 నోట్లు వచ్చాయి. తాజాగా, రూ.500 నోట్లు నంబర్ సిరీస్ లేకుండా వచ్చాయి. 
 
మధ్యప్రదేశ్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు వచ్చాయి. ఈ నోట్లపై రిజర్వ్ బ్యాంకు ముద్రించిన నంబర్ సిరీస్ లేదు. అలాంటి నోట్లు ఏటీఎం కేంద్రాల్లోకి ఎలా వస్తున్నాయంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా బ్యాంకు అధికారులకు ప్రమేయం ఉంటుందని, అందువల్ల దీనిపై రిజర్వు బ్యాంకు అధికారులు దృష్టిసారించాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి